Tollywood hero Gopichand escaped from the Major Incident .The film unit and fight masters have responded in a timely manner and have taken serious precautions that have been missed.
#gopichand
#anilsunkara
#thiru
#mandawa
#jaipur
#tollywood
#fightmasters
#shooting
#bike
#fortis hospital
టాలీవుడ్ హీరో గోపిచంద్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. తాను నటిస్తున్న చిత్ర షూటింగ్‌లో చోటుచేసుకొన్న ప్రమాదంలో గోపిచంద్‌కు స్వల్పగాయాలయ్యాయి. చిత్ర యూనిట్, ఫైట్ మాస్టర్లు సకాలంలో స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయిందని తెలిసింది. వివరాలల్లోకి వెళితే..
ప్రస్తుతం గోపిచందర్ హీరోగా దర్శకుడు తిరు దర్శకత్వంలో నిర్మాత అనిల్ సుంకర ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని మాండవలో చిత్రీకరణ జరుపుకొంటున్నది. ఈ షూటింగ్‌లో భాగంగా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగానే ప్రమాదం చోటుచేసుకొన్నది.
హీరో గోపిచంద్‌పై బైక్‌తో ఛేజింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. షూటింగ్ జరుగుతున్న సమయంలో బైక్ అదుపు తప్పడంతో గోపిచంద్ కిందపడిపోయాడని, స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్సను వైద్యులు చేశారు. అనంతరం గోపిచంద్‌ను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
బైక్ అదుపు తప్పడం వల్ల గోపిచంద్‌కు గాయాలయ్యాయి. స్థానిక ఫోర్టీస్ హాస్పిటల్స్‌లో ప్రాథమిక చికిత్స జరిగింది. ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు. గాయాలకు ట్రీట్‌మెంట్ చేశారు. కొన్ని గంటలు విశ్రాంతి తీసుకొన్న తర్వాత షూటింగ్ జరుపుకోవచ్చని ఫోర్టీస్ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారని చిత్ర యూనిట్ వెల్లడించింది.